ETV Bharat / state

అదనంగా 23 పోలింగ్​ కేంద్రాలు: వరంగల్​ అర్బన్​ కలెక్టర్​ - total polling centres for warangal mlc elections

పట్టభద్రుల శాసన మండలికి ఓటరు నమోదులో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హనుమంతు కోరారు. ఈ మేరకు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జిల్లా ప్రతినిధులతో కలెక్టరేట్​​లో ఆయన సమావేశమయ్యారు.

warangal urban collector meeting in collectorate for mlc voter polling
అదనంగా 23 పోలింగ్​ కేంద్రాలు: వరంగల్​ అర్బన్​ కలెక్టర్​
author img

By

Published : Oct 9, 2020, 12:48 PM IST

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసన మండలికి ఓటరు నమోదులో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. హన్మకొండలోని కలెక్టరేట్ మినీ సమావేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన జిల్లా ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఓటరు నమోదుకు కావలసిన ఫారం 18 దరఖాస్తులని తహసీల్దార్ కార్యాలయంలో సిద్ధం చేశామని అన్నారు. ఇంకా ఏమైనా దరఖాస్తులు తక్కువగా ఉన్నట్లు భావిస్తే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

మొత్తం 87 పోలింగ్​ కేంద్రాలు..

గతంలో 64 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఓటరు నమోదు ప్రక్రియ ఈసారి పెరుగుతుందనే ఉద్దేశంతో అదనంగా 23 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు చెప్పారు. హన్మకొండలో 38, వరంగల్ 21, కాజీపేట 10, హసన్​పర్తి 6, ఖిలావరంగల్ 6, ధర్మసాగర్ 3, వేలేరు, కమలాపూర్, ఐనవోలు మండలాల్లో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: తక్కువ ధరకే జనరిక్​ మందులు.. నెలవారీ ఖర్చులో భారీ ఆదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.