వరంగల్ నగర మేయర్‌గా గుండా ప్రకాష్ ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ నేతృత్వంలో ఇవాళ కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా ఉపఎన్నికల్లో ఎన్నికైన 19వ డివిజన్ కార్పొరేటర్ నాగరాజు చేత ఈ కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మేయర్ అభ్యర్థిగా గుండా ప్రకాష్ రావు.. పేరును కార్పొరేటర్ వద్దిరాజు గణేష్ ప్రతిపాదించగా... మిగిలిన కార్పొరేటర్లు
అందుకు ఆమోదం తెలిపారు. మేయర్‌గా గుండా ప్రకాష్ రావు ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రకటించారు.
రెండ్రోజులుగా మేయర్ ఎన్నికపై కసరత్తు
తెరాస ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు గత రెండ్రోజులుగా నగరంలోనే ఉండి కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉండటం, కార్పొరేటర్ల మద్దతు ఉన్న... 26వ డివిజన్ కార్పొరేటర్, వ్యాపారవేత్త గుండా ప్రకాష్‌ను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ప్రకాష్ రావుకు, రెండు సార్లు కార్పొరేటర్‌గా, రెండు సార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.
ఇవీ చదవండి: 'స్థానికపోరులోనూ అత్యధిక స్థానాలను గెలుస్తాం'