ETV Bharat / state

అర్చకులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మేయర్​ - lockdown

వరంగల్ నగరం​లోని మట్టెవాడ భోగేశ్వర స్వామి ఆలయంలో 200 మంది నిరుపేద అర్చకులకు మేయర్​ గుండా ప్రకాష్​ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. అర్చకులకు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

warangal mayor gunda prakash groceries distribution
నిరుపేద అర్చకులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మేయర్​
author img

By

Published : May 7, 2020, 7:51 PM IST

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వేద పండితులను వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్​ గుండా ప్రకాష్ ఆదుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆలయాలు మూతపడడం, శుభకార్యాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద అర్చకులకు మేయర్ గుండా ప్రకాష్ నిత్యావసర సరకులతో పాటు బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు.

మట్టెవాడలోని భోగేశ్వర స్వామి ఆలయంలో నగరంలోని సుమారు 200 మంది నిరుపేద అర్చకులకు సరకులు అందజేశారు. అర్చకులకు బాసటగా నిలుస్తామని.. అధైర్య పడకుండా ఉండాలని మేయర్​ వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి: రాష్ట్రాల్లోని పరిస్థితులను గమనించాలి : కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.