బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల నేడు, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి తెలిపారు. కంట్రోల్ రూంలో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1980 ఏర్పాటు చేసి, 24 గంటలు పని చేసేలా సిబ్బందిని నియమించామని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో సత్వర సాయం అందిస్తామని వివరించారు.
ముంపు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. వారికి ఎల్లవేళలా వరంగల్ మహానగరపాలక సిబ్బంది తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. భారీ వర్షాలతో సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని నగరవాసులకు చెప్పారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 10వేల పల్లెలకు సోకిన కరోనా వైరస్!