వరంగల్ అర్బన్ పట్టణ కేంద్రంలోని భద్రకాళి చెరువుపై నగర ప్రజల కోసం చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ పరిశీలించారు. ట్యాంక్ బండ్ అందాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. నగర వాసులకు ఇది మంచి ఆహ్లాదకరంగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా దీనిని ప్రారంభించనున్నారని తెలిపారు.
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ ట్యాంక్‌బండ్ జిల్లా ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చి వీక్షించేందుకు అనువుగా ఉందని చెప్పారు. మిగిలిపోయిన చిన్న చిన్న పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుడా ఛైర్మన్ యాదవ రెడ్డి, నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.