చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రౌడీషీటర్లు, భూకబ్జాదారుల కదలికలపై నిఘా పెట్టాలని వరంగల్ సీపీ రవీందర్ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్లవారీగా అధికారుల పనితీరుతో పాటు కేసుల నమోదు, వాటి పరిష్కరణ, నిందితుల అరెస్టులు వంటి వివరాలను సీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు పలు సూచనలను చేశారు.
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంపొందించే విధంగా అధికారులు సేవ చేయాలని కోరారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా.. అధికారులు, సిబ్బంది ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సీపీ కోరారు.