వరంగల్ అర్బన్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో... సుమార్గ్ ద్వారా నిర్వహించిన ఉచిత శిక్షణా తరగతులను ఉపయోగించుకుని కొలువులు సంపాదించిన అభ్యర్ధులను నగర పోలీస్ కమిషనర్ వి. రవిందర్ అభినందించారు. మొత్తం పది వేల మందికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి.. అందులో 300 మందిని ఎంపిక చేసి.. వారికి ఏడాదిన్నర పాటు పోటీ పరీక్షల్లో శిక్షణ అందించారు. వీరిలో 254 మంది అభ్యర్ధులు పరీక్షల్లో ఉతీర్ణులై ఇన్ స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు సంపాదించారు. భవిష్యత్తులోనూ ఉచిత శిక్షణ కొనసాగుతుందని సీపీ తెలిపారు.
ఇవీ చూడండి: ఆ విషయంలో జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు