ETV Bharat / state

గ్రేటర్​ వరంగల్​లో అభివృద్ధి పనులకు రూ.30 కోట్ల నిధులు - warangal mayor gunda prakash

ప్రజోపయోగమైన 30 కోట్ల రూపాయల పనులకు గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఎప్పుడూ లేనంతగా నగరంలో వరదలు రావడం వల్ల జాతీయ విపత్తు కింద కేంద్ర ప్రభుత్వం నగరానికి రూ.500 కోట్ల నిధులు ఇవ్వాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

warangal corporation standing committee meeting
గ్రేటర్​ వరంగల్​లో అభివృద్ధి పనులకు రూ.30 కోట్ల నిధులు
author img

By

Published : Aug 29, 2020, 10:38 AM IST

గ్రేటర్ వరంగల్​లో నిధులున్నా అధికారుల అసమర్థత వల్ల అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కరోనా నిబంధనలతో వరంగల్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం హన్మకొండలోని అంబేడ్కర్ భవన్​లో జరిగింది. మేయర్ గుండా ప్రకాశ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్పొరేషన్ పరిధిలోని 58 డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానవాటికలు, మరుగుదొడ్లు, కమ్యూనిటీ హాల్ ఇతర అభివృద్ధి పనుల కోసం ... 30 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమోదం తెలిపారు. ప్రజా సమస్యలను సమగ్రంగా చర్చించేందుకు...ఇకపై నెలకు రెండు సార్లు సమావేశమవ్వాలని కౌన్సిల్ నిర్ణయించింది.

వర్షాలు, వరదల కారణంగా...వరంగల్ అతలాకుతలమైందని....లోతట్లు ప్రాంతాలు నీట మునిగి భారీ నష్టం సంభవించిందని... పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వరదల వల్ల భారీ నష్టం సంభవించినందున జాతీయ విపత్తు కింద కేంద్రం ...నగరానికి 500 కోట్ల రూపాయలు ఇవ్వాలని సభ తీర్మానించింది. వరంగల్ పరిసర ప్రాంతాల్లో నాలాల ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నట్లు మేయర్ గుండా ప్రకాష్ రావు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.