ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళీమాతను వివిధ రకాల పూలతో జ్వాలా మాలిని క్రమంలో అలంకరించారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తప్పనిసరిగా భౌతికదూరం పాటించే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే ఆలయ అధికారులు దర్శనానికి అనుమతిస్తున్నారు.