వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం గుడ్లసింగారంలో ముస్లింలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ నిత్యావసర సరకులు అందజేశారు. లాక్డౌన్లో నిరుపేద ముస్లింలు ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
కరోనా వ్యాపిస్తున్నందున ముస్లింలందరూ భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సూచించారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.