ETV Bharat / state

పలుగూ పార పట్టి.. ఉపాధి పనులు చేపట్టి

లాక్‌డౌన్‌ కారణంగా పని లేకుండా పోయిన వారికి.. ఉపాధి హామీ పనులు వరంలా మారాయి. పీజీ, బీటెక్ చేసిన విద్యావంతులు, చిరుద్యోగులూ, ఉపాధి పనుల్లో పాల్గొంటూ... ఎంతో కొంత ఆర్జిస్తున్నారు. కష్టకాలంలో తమ కుటుంబాలకు సాయంగా నిలుస్తున్నారు.

UPADHI HAMI WORKS TO PEOPLE TO DURING LOCK DOWN IN WARANAGAL
పలుగూ పార పట్టి.. ఉపాధి పనులు చేపట్టి
author img

By

Published : May 9, 2020, 8:19 AM IST

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా చిన్నాభిన్నం చేస్తోంది. కోట్లాదిమందిని పనికి దూరం చేసి రోడ్డున పడేసింది. అగ్రరాజ్యం అమెరికానే కరోనా ధాటికి కుదలైందంటే... ఇక మిగతా దేశాల గురించి చెప్పక్కరలేదు. లాక్‌డౌన్‌ కారణంగా చాలా మందికి పని లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమతమౌతున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రభుత్వం కల్పించే ఉపాధి హామీ పనులు.. చాలామందికి వరంగా మారుతున్నాయి. గ్రామాల్లో ఉండేవారు, ఎలాంటి చదువూ లేని వాళ్లే అధికంగా ఈ పనులకు వెళ్లే వాళ్లు. కానీ గత నెల నుంచి బీటెక్‌, పీజీ, డిగ్రీ చేసిన విద్యావంతులూ పలుగూ పార పట్టి మట్టి పనులు చేస్తూ... అంతో ఇంతో సంపాదిస్తున్నారు.

13 వేల మంది యువకులు

వరంగల్ ఆర్బన్ జిల్లాలోనే 13 వేల మంది యువకులు.. ఈ విధంగా పనుల్లో పాల్గొంటున్నారు. ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులూ, ఉద్యోగాలు కోల్పోయిన చిరుద్యోగులకూ ఉపాధి హామీ పనుల ద్వారా ఆదాయం లభిస్తుండంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అందరికీ పని

వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరిశీలించారు. అనంతరం వారితో కలసి పని చేశారు. గత ఏడాదితో పోలిస్తే... ఈసారి పనులు చేసే వారి సంఖ్య పెరిగిందన్నారు. ఉపాధి హామీ పనుల కోసం సీఎం రూ. 175 కోట్లు కేటాయించారని... అందరికీ పని కల్పించాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఎవరు పని చేయడానికి ముందుకొస్తే...వారికి జాబ్ కార్డు ఇస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా నగరాలు, పట్టణాల్లో ఉపాధి కరవైంది. పని లేకుండా పోవడంతో సొంతూళ్లకు తిరిగివచ్చినవారికి ఉపాధి హామీ కొండత అండగా నిలుస్తోంది. పస్తులండకుండా చేస్తోంది.

ఇదీ చూడండి : భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.