ఈనాడు పెళ్లి పందిరి డాట్ నెట్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లాలో నిర్వహించిన వైద్య వధూవరుల వివాహ పరిచయ వేదికకు అనూహ్య స్పందన వచ్చింది. కాజీపేటలోని ఫాతిమా కాంప్లెక్స్‌లో జరిగిన ఈ పరిచయ వేదికకు వివిధ జిల్లాల నుంచి వైద్యులతోపాటు వారి తల్లిందండ్రులు హాజరయ్యారు. అనంతరం వధూవరులు సభా వేదికపైకి వచ్చి తమను తాము పరిచయం చేసుకున్నారు. కులం, గోత్రం, వయస్సు ఇతరాత్ర వివరాలను పరస్పరం పంచుకున్నారు. కొందరు తమకు నచ్చిన వధువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో తమ పేర్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్లతో పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కూడా ఉత్సాహంగా ఈ వివాహ పరిచయ వేదికలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: భారీ ధరకు 'దర్బార్' హక్కులు.. 'తలైవా' డబుల్ సెంచరీ