వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం జిల్గుల గ్రామంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను అమ్ముతున్న భరతకృష్ణ అలియాస్ కిట్టు మాణిక్యపూర్, ప్రశాంత్ మాణిక్యపూర్ అనే ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్కతుర్తి, వంగర, ముల్కనూర్, హుజురాబాద్ ప్రాంతాల్లోని తమ ఏజెంట్లకు నిషేధిత గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తుండగా వీరిని పోలీసులు పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి రూ. 5,41,400 నగదును, రూ.1.50 లక్షల విలువైన 150 అంబర్ ప్యాకెట్లతోపాటు 4 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 11 మందిపై కేసును నమోదు చేశామన్నారు. ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. నిందితులను పట్టుకున్నఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు.
ఇదీ చూడండి: యూపీలో ఇద్దరు పూజారుల హత్య- యోగిపై విపక్షాల విమర్శలు