వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నర్సంపేట బస్ డిపో నుంచి అఖిల పక్షాలతో కలిసి ప్రారంభమైన ర్యాలీ.. క్యాంప్ ఆఫీస్ సమీపానికి చేరుకోగానే.. అప్పటికే వేచిచూస్తున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఆ క్రమంలో తోపులాట జరిగింది. ఆందోళనకారులతో పాటు పలు పార్టీల నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. క్యాంపు కార్యాలయ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. ఓ మహిళా కానిస్టేబుల్, ఆర్టీసీ కార్మికులకు స్వల్పంగా గాయాలయ్యాయి.