వరంగల్‌లో ఎంపీ అర్వింద్ కారుపై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహంతో హంటర్‌రోడ్డులోని భాజపా కార్యాలయంపైా కూడా దాడి చేశారు. దాడికి పాల్పడిన తెరాస నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గులాబీ కార్యకర్తల దాడితో భాజపా నాయకులు.. వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తన అనుచరులతో పార్టీ కార్యాలయంపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని భాజపా నేతలు అన్నారు.
ఇవీచూడండి: మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి తొలి బోనం