ట్రాన్స్‌జెండర్లు ఆర్థికంగా నిలదొక్కుకునేలా వరంగల్ మహానగర పాలక సంస్థ నూతన అధ్యాయానికి నాంది పలికింది. బల్దియా కమిషనర్ పమేలా సత్పతి చొరవతో రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ, మెప్మా సహకారంతో ట్రాన్స్‌జెండర్ల కోసం లౌక్యం ఫార్మసీని ఏర్పాటు చేశారు. దీనిని కమిషనర్ పమేలా సత్పతి ప్రారంభించారు.
ఉన్నత చదువులు పూర్తి చేసిన ట్రాన్స్‌జెండర్లను గుర్తించిన కమిషనర్... వారు ఆర్థికంగా ఎదిగేలా తోడ్పాటును అందించడానికి తమ వంతు బాధ్యతగా ఫార్మసీ ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. వరంగల్ నగరంలోని ట్రాన్స్‌జెండర్లను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా బాధ్యతలను నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. కమిషనర్‌కి ట్రాన్స్‌జెండర్లు ఘన స్వాగతం పలికారు.
ఇదీ చదవండి: 'పార్టీ మారను... కార్యకర్తలకు అండగా ఉంటా'