ETV Bharat / state

ఎనుమాముల మార్కెట్ వద్ద వ్యాపారుల ధర్నా.. నిలిచిన తూకాలు

వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ కార్యాలయం వద్ద వ్యాపారులు ధర్నా నిర్వహించారు. నాగేంద్ర ట్రేడింగ్‌ కంపెనీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. వ్యాపారుల ఆందోళనతో మార్కెట్‌లో తూకాలు నిలిచిపోయాయి.

protests at warangal enumamula market yard
ఎనుమాముల మార్కెట్‌ వద్ద ధర్నా
author img

By

Published : Nov 1, 2021, 1:38 PM IST

వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు ఆందోళనకు దిగారు. నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీకి చెందిన వ్యాపారులు రూ. 15 కోట్ల బకాయిలను చెల్లించాలని మార్కెట్ కార్యాలయం ఎదుట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మిరప, పత్తి, అపరాలతోపాటు పసుపు, వేరుశనగ వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఎనుమాముల మార్కెట్ వద్ద వ్యాపారుల ధర్నా

వ్యాపారుల ఆందోళనతో మార్కెట్ యార్డ్‌లోని క్రయవిక్రయాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మార్కెట్ అధికారులు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. కలెక్టర్ రావాలనే డిమాండ్‌తో వ్యాపారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు, నాగేంద్ర ట్రేడర్స్ కంపెనీకి చెందిన యుగేందర్ సోదరులకు అండగా ఉన్నారని వ్యాపారులు ఆరోపించారు. చివరకు కలెక్టర్ హామీతో వ్యాపారులు ఆందోళన విరమించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడికి కలెక్టర్ సూచించారు.

ఇదీ చదవండి: Metro Parking: వాహనం ఆపితే రూ.25 వసూలు.. మెట్రో నిలుపు దోపిడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.