ETV Bharat / state

రెండు ఐటీ కంపెనీలను ప్రారంభించనున్న కేటీఆర్.. ఏర్పాట్లు పూర్తి​ - వరంగల్ అర్బన్ జిల్లా తాజా సమాచారం

ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్​.. రేపు వరంగల్​ అర్బన్​ జిల్లా మడికొండ శివార్లలో ప్రారంభించనున్న రెండు ఐటీ కంపెనీలతో సుమారు వెయ్యిమందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ ప్రారంభత్సోవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

రెండు ఐటీ కంపెనీలను ప్రారంభించనున్న కేటీఆర్.. ఏర్పాట్లు పూర్తి​

author img

By

Published : Jan 6, 2020, 2:01 PM IST

రెండు ఐటీ కంపెనీలను ప్రారంభించనున్న కేటీఆర్.. ఏర్పాట్లు పూర్తి​
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ శివార్లలో నెలకొల్పిన సైయెంట్, టెక్ మహీంద్రా ఐటీ ప్రాంగణాలను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే కేటీఆర్ చేతులమీదుగా వీటి ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వలన రద్దయింది.

అయితే ఈ ప్రారంభోత్సవం తర్వాత సాఫ్ట్​వేర్, పొరుగు సేవల ద్వారా సుమారు వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు లభించనుండగా.... వరంగల్ జిల్లాకు చెందిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న సైయంట్, ఐటీ కంపెనీ ఏర్పాటు కోసం 2016 లో ప్రభుత్వం నుంచి స్థలాన్ని సేకరించి నిర్మాణ పనులు ప్రారంభించారు. 2017లో వందమంది ఐటీ సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో ఇక్కడ సేవలను అందించారు. ప్రస్తుతం మూడు అంతస్తుల భవనం పూర్తి కావడం వల్ల మరో 600 మందికి పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: శ్రీవారి సన్నిధిలో 'మన' మంత్రులు...

Intro:TG_WGL_11_06_KTR_RAAKA_KOSAM_IT_COMPANY_LA_MUSTHABU_ADD_VIS_AV_TS10132Body:Contributer : D, VENU KAZIPET DIVISION Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.