వరంగల్ మహానగర పాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ పక్కడ్బందీగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ క్రిస్టినా జెడ్ చోగ్తో పేర్కొన్నారు.
వరంగల్ మహానగర పాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పరిశీలనను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతోపాటు.. బల్దియా కమిషనర్ పమీలా సత్పతి పర్యవేక్షించారు. 16వ డివిజన్లో ఒకే అభ్యర్థికి రెండు వేరు వేరు టీవీఆర్ నంబర్లతో కూడిన ఓటు హక్కు కలిగి ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి మరో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలకు సంబంధించిన ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆమోదించాలని అధికారులకు సూచించారు. అభ్యంతరం వ్యక్తం చేసిన వారి నామినేషన్లపై విచారణ జరుపుతామని తెలిపారు. రెండు ఓటర్ కార్డు ఉన్నట్లు రుజువైతే నామినేషన్ తిరస్కరించబడుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రెమ్డెసివిర్ వల్ల మరణాలు తగ్గవు: గులేరియా