మినీ పురపోరుకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలికలు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలు, జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ సహా మరో ఎనిమిది పట్టణాల్లోని వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారులు స్థానికంగా నోటీస్ జారీ చేస్తారు. దాంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా కూడా నామినేషన్లు దాఖలు చేసే వెసులుబాటు ఉంది. నామినేషన్ల దాఖలు సందర్భంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి : సొంతఖర్చులతో గ్రామ ప్రజలందరికీ టీకా వేయించిన సర్పంచ్