ETV Bharat / state

'ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్​పై వెనక్కి తగ్గిన కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ - వరంగల్ తాజా వార్తలు

అన్నదాతల ఆందోళనతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ వెనక్కి తగ్గింది. ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్​ను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు.

సుందర రాజ్ కుడా ఛైర్మన్
సుందర రాజ్ కుడా ఛైర్మన్
author img

By

Published : May 11, 2022, 4:06 PM IST

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూసమీకరణ( ల్యాండ్ పూలింగ్) నోటిఫికేషన్ రద్దుపై కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ వెనక్కి తగ్గింది. ల్యాండ్ పూలింగ్ నిలివేయాలని నిర్ణయించింది. 41 కిలోమీటర్ల మేర వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూములను తీసుకోవాలని కుడా నిర్ణయించింది.

దీంతో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో చేపడుతున్న భూసమీకరణతో రైతులు ఆందోళన బాట పట్టారు. 8 మండలాల్లో, 28 గ్రామాల పరిధిలోని 22 వేల 749 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సేకరించాలని గతంలో జీవో విడదల చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో నోటిఫికేషన్ రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. అధికారుల తాజా నిర్ణయంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"వరంగల్, హనుమకొండ జిల్లాల్లో చేపడుతున్న భూసమీకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేశాం. అందులోనే సేకరిస్తున్న భూముల సర్వే నెంబర్లను ప్రకటించాం. కొందరు దీనిని తప్పుగా అర్ధం చేసుకున్నారు. రైతుల భూములను కుడా లాక్కునే ప్రయత్నం చేస్తుందని అనుకున్నారు. దీనిపై అన్నదాతలు ఆందోళన చేపట్టారు. దీంతో నోటిఫికేషన్ రద్దుకు నిర్ణయం తీసుకున్నాం."-సుందర రాజ్ కుడా ఛైర్మన్

ఇదీ చదవండి: 'సమస్యల వలయంలో రాష్ట్రం.. ఫామ్​హౌజ్​లో కేసీఆర్'

వేల అడుగులు ఎత్తయిన కొండపై ట్రాక్టర్​ స్టంట్స్​.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.