ETV Bharat / state

స్పష్టమైన ధ్యేయం.. కావాల్సింది సహాయం - boxer santhoshi

ఆమె పుస్తకం పడితే చదువుల తల్లి మురిసిపోతుంది. ఆమె కిక్ కొడితే ప్రత్యర్థికి దిమ్మ తిరుగుతుంది. ఆమె బరిలో నిలిస్తే పతకం చిన్నబోతుంది. 14 ఏళ్ల పసి ప్రాయంలోనే అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడిస్తోంది సంతోషి. ఓరుగల్లు ఖ్యాతిని ప్రపంచ పటంలో పదిలం చేసేందుకు శ్రమిస్తోంది ఆ చిన్నారి. అయితే... ఆమె ఆశయానికి పేదరికం ఆటంకంగా నిలుస్తోంది. చేయూత కోసం చమర్చిన కళ్లతో ఆశగా ఎదురు చూస్తోంది.

స్పష్టమైన ధ్యేయం.. కావాల్సింది సహాయం
author img

By

Published : Apr 25, 2019, 4:49 AM IST

స్పష్టమైన ఆశయం.. అంతే అండగా నిలిచే తల్లిదండ్రులు.. పదునైన వ్యూహాలు నేర్పించే గురువు.. చేతినిండా పతకాలు ఆమె సొంతం. వరంగల్​ జిల్లా ఏకశిలానగర్​లో నివసిస్తున్న సంతోషికి కిక్​ బాక్సింగ్​ అంటే ప్రాణం.. కిక్​ కొడితే పతకం ఖాయం చేసే సత్తా ఉన్నా పేదరికం ఆమె పట్టుదలకు తూట్లు పొడుస్తోంది.

అడుగడుగునా పేదరికం అడ్డు తగులుతున్నా ఈనెల మొదటివారంలో టర్కీలో జరిగిన అంతర్జాతీయ కిక్​ బాక్సింగ్​ ఛాంపియన్​ షిప్​లో వెండి పతకం సొంతం చేసుకుంది.

ఆరో తరగతి నుంచే ఆరంభం

ఆరో తరగతిలో ఉండగా వేసవి శిక్షణ శిబిరంలో యోగా నేర్చుకున్న సంతోషి.. ఆత్మరక్షణ కోసం కరాటే సాధన చేసింది. ఆ తర్వాత గురువుల సూచనలతో కిక్​ బాక్సింగ్​పై దృష్టి సారించింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వరుస పతకాలు సొంతం చేసుకుంది. 2015లో కరీంనగర్​ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాయింట్​ ఫైట్​, లైట్​ కాంటాక్ట్​ ఫైట్​ విభాగాల్లో స్వర్ణ, రజత పతకాలను తన ఖాతాలో వేసుకుని జాతీయ స్థాయికి అర్హత సాధించింది. అదే సంవత్సరం దిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పాయింట్​ ఫైట్​ విభాగంలో కాంస్యం సొంతం చేసుకుంది. గత ఏడాది హిమాచల్​ ప్రదేశ్​లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది సంతోషి.

సరైన కిట్​ లేకుండానే..

సంతోషికి సంకల్ప బలంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే పట్టుదల గట్టిగా ఉన్నా ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించడం లేదన్నారు ఆమె గురువు తిరుపతి. సరైన కిక్​ కూడా ఆమె వద్ద లేదని... దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని కోరారు.

కుమార్తె ఆశయం తమకు తెలిసినా.. ఆమెకు మంచి వసతులు కల్పించాలనుకున్నా.. ఆర్థిక పరిస్థితి అనుకూలించడం లేదని సంతోషి తల్లిదండ్రులు మధు, రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. కఠోర శ్రమ పడుతున్నా ఆమె ఆశయానికి అండగా నిలిచే స్థోమత తమకు లేదన్నారు.

సంతోషి ప్రతిభను మెచ్చుకుని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పదివేల రూపాయల నగదు బహుమతి అందించారు. ఒలింపిక్స్​లో రాణించడమే ధ్యేయంగా కృషిచేస్తున్న సంతోషికి ఆర్థికంగా అండగా నిలవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

స్పష్టమైన ధ్యేయం.. కావాల్సింది సహాయం

ఇవీ చూడండి: క్రికెట్​ బెట్టింగ్​ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.