ETV Bharat / state

Telangana Student Speech in Parliament : పార్లమెంట్​లో ప్రసంగించిన తెలంగాణ విద్యార్థిని.. ఎవరో తెలుసా! - పార్లమెంట్​లో అడుగుపెట్టిన తెలంగాణ విద్యార్థిని

Telangana Student Prathima Speech in Parliament : 18 ఏళ్ల ప్రయాణంలోనే పార్లమెంట్​లో అడుగుపెట్టే భాగ్యం దక్కింది. తన ప్రతిభతో దేశ అత్యున్నతమైన హౌస్​లో తన ప్రసంగించే అవకాశాన్ని దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వక్తృత్వ పోటీలdలో ఆ యువతి సత్తా చాటింది. జాతీయస్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ యువతి ఎవరు అంటే వరంగల్​ జిల్లాకు చెందిన ప్రతిమ. పల్లె నుంచి.. పార్లమెంట్ వరకు ప్రతిమ​ ప్రయాణం గురించి తెలుసుకుందాం.

Student Prathima Full Details
Telangana Student Prathima Speech in Parliament
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 3:02 PM IST

Telangana Student Speech in Parliament పార్లమెంట్​లో ప్రసంగించిన తెలంగాణ విద్యార్థిని

Telangana Student Prathima Speech in Parliament : తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అవ్వడంతో ముందు నుంచే చదువుపై ఆసక్తి. అంతే కాదు ప్రసంగాలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కడ వక్తృత్వ పోటీలు జరిగినా పాల్గొని.. తన సత్తా చాటుతూ ఉండేది ఆ విద్యార్థిని. ఈ క్రమంలో జాతీయ స్థాయి(National Level)లో నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో పాల్గొని.. మొదటి ర్యాంక్​ తెచ్చుకుని తన గుర్తింపుని మరింత పెంచుకుంది. ప్రథమ స్థానం వచ్చినందుకు తెలంగాణ రాష్ట్రం తరఫున పార్లమెంట్​లో ప్రసంగం ఇచ్చే అవకాశం కొట్టేసింది. ఈ అరుదైన గౌరవం దక్కినందుకున్న ఆ విద్యార్థిని పేరే ప్రతిమ.

Student prathima Select for Gandi jayanthi Speech in Parliament : వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన విష్ణుకుమార్ కవిత దంపతులకు కుమార్తె ప్రతిమ. చిన్నతనం నుంచి వక్తృత్వ పోటీల్లో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. అనేక వక్తృత్వ పోటీల(Debate Compitation)లో సత్తా చాటింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో తెలంగాణ నుంచి ప్రథమ స్థానం సాధించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పోటీలు నిర్వహించగా మొత్తం 25 మంది అభ్యర్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. వారికి గాంధీ జయంతి సందర్భంగా పార్లమెంటులో మహనీయులకు శ్రద్ధాంజలి గెలిపించడంతో పాటు ప్రసంగించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

Interview with Poet Pranavi : 'సమాజంలో మార్పు కోసమే నా రచనలు'

NYKS Debate Compitation Winner 2023 Telangana : జిల్లా రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన ప్రతిమ ఇప్పుడు జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తల్లిదండ్రులు వృత్తిరీత్యా అధ్యాపకులు కావడంతో తనకు ఈ పోటీల్లో మరిన్ని అవకాశాలు కలిసి వచ్చాయని వివరించింది. చిన్నతనం నుంచి తన కుమార్తె వక్తృత్వ వికాస పోటీలతో పాటు వ్యాసరచన పోటీలలో ఆసక్తిగా పాల్గొనేదని తండ్రి విష్ణుకుమార్ తెలిపారు. తమ కుమార్తె ఎంచుకున్న మార్గంలో ప్రయాణించేందుకు అన్ని విధాలుగా సహకరించామని అన్నారు. 2017లో ఎవరికి దక్కని అవకాశం శ్రీహరికోటలో ఇస్రో సాటిలైట్ లాంచింగ్ చూసే అవకాశం దక్కిందని తల్లిదండ్రులు గర్వంగా చెబుతున్నారు.

"గాంధీజీ జయంతి సందర్బంగా పార్లమెంట్​లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం దక్కింది. నెహ్రూ యువ కేంద్రం వక్తృత్వ పోటీలను జిల్లా స్థాయిలో నిర్వహించింది. అనంతరం రాష్ట్ర స్థాయిలోనూ నా ప్రతిభ చాటుకోవడంతో పార్లమెంట్​లో స్పీచ్ ఇచ్చే​ అవకాశం దక్కింది. ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా బ్యాచ్​ మొత్తం 25 మంది."- ప్రతిమ, విద్యార్థిని

Student Prathima Full Details : ఇటీవల కేంద్రం నిర్వహించిన పోటీల్లో తెలంగాణ నుంచి తమ కుమార్తె ప్రతిమ ఎంపిక కావడం సంతోషంగా ఉందని తల్లి కవిత వివరించారు. నూతన పార్లమెంటును తమ కుమార్తె ద్వారా చూసే భాగ్యం దక్కిందని తండ్రి పేర్కొన్నారు. తమ కుమార్తె విజయాల పరంపరతో అరుదైన ప్రదేశాలను చూసే భాగ్యం కలిగిందని తల్లిదండ్రులు తెలిపారు. ప్రతిమ చిన్నతనం నుంచే మహనీయుల గాధను భగవద్గీత పారాయణం చేసేదని చెప్పారు. పార్లమెంట్లో ప్రసంగించడం అరుదుగా దొరికే అవకాశం అని.. ఇలాంటి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని ప్రతిమ వెల్లడించింది.

SI Hemalatha interview in Tealangana : 'నా విజయంలో కుటుంబంతో పాటు ఈనాడు పేపర్ కీలకంగా నిలిచింది'

Young cloud Photographer in Hyderabad : ఫొటోలతో మేఘ సందేశం.. చూస్తే వావ్​ అనాల్సిందే..!

Para Badminton: విధిరాతను ఎదిరించి.. పారా బ్యాడ్మింటన్‌లో సత్తా చాటుతున్న శ్రీకాకుళం యువతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.