special bus for Nallabelli village: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామస్తులకు బస్సు సౌకర్యం లేని లోటు స్పష్టంగా తెలుసు. ఎనిమిది నెలలు రవాణా సౌకర్యం లేకుండా ఆ గ్రామ వాసులు పడిన బాధలు ఆ దేవుడుకే ఎరుక.. వారు తిరగని ఆఫీసులు లేవు.. కలవని నాయకుడు లేరు.. పట్టువిడవవి విక్రమార్కుడులా వారి కృషికి తెలంగాణ ఆర్టీసీ ఒక రోజు శుభవార్త చెప్పింది. అదే ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు పున:ప్రారంభిస్తామని వార్త.. ఆ వార్తతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
గ్రామంలోకి వచ్చిన ఆర్టీసీ బస్సుకు అందంగా ముస్తబుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రయ్.. రయ్ అంటూ చేతులు ఊపి బస్సు ప్రారంభించారు. ఇక నుంచి ఈ బస్సు మా అందరిది.. దీనిని ప్రత్యేకంగా చూసుకునే బాధ్యత మాపై ఉంది. ఆర్టీసీ ఆస్తులు మన ఆస్తులు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రమాణం చేసి కొబ్బరి కాయ కొట్టి బస్సును ప్రారంభించారు. నల్లబెల్లి నుంచి వరంగల్‌కు బస్సు సర్వీస్ వేసిన ఆర్టీసీ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: