వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఉద్యమకారుడు దర్శన్ సింగ్ టికెట్ రాలేదని టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో 9వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా తెరాస తరఫున టికెట్ ఆశించి.. రాలేదన్న మనస్తాపంతో టవర్ ఎక్కారు.
తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న వారిని పక్కన పెట్టి... ఉద్యమ ద్రోహులకు టికెట్ ఇచ్చారని దర్శన్ సింగ్ ఆరోపించారు. ఈ సంఘటనతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలు వద్దు.. టవర్ దిగాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకోం: ఎర్రబెల్లి