ETV Bharat / state

Telangana Group2 Candidate Committed Suicide : స్వగ్రామానికి ప్రవల్లిక మృతదేహం.. మధ్యాహ్నం అంత్యక్రియలు - TSPSC Group 2 Exam Postponed

Telangana Group2 Candidate Committed Suicide at Hyderabad : టీఎస్​పీఎస్సీ నిర్వహించే గ్రూప్​-2 పరీక్ష వాయిదా పడటంతో.. శుక్రవారం ఒక అభ్యర్థిని తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని పోలీసులు భారీ బందోబస్తు మధ్య స్వగ్రామమైన బిక్కాజిపల్లికి తరలించారు. ప్రవల్లిక మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు.. గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Group2 Candidate Committed Suicide
Telangana Group2 Candidate Committed Suicide
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2023, 10:23 AM IST

Telangana Group2 Candidate Committed Suicide at Hyderabad : గ్రూప్​-2 పరీక్షలు వాయిదా పడటం(Group2 Exam Postponed)తో ఆవేదన చెంది శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక మృతదేహాన్ని(Young Girl Suicide at Hyderabad).. ఆమె స్వగ్రామం బిక్కాజిపల్లికి పోలీసులు భారీ బందోబస్తు మధ్య తరలించారు. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బోరున విలపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

హైదరాబాద్​లోని అశోక్​నగర్​లో బృందావన్​ లేడీస్​ హాస్టల్​లో ఉంటూ ప్రవల్లిక(23) గ్రూప్​-2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఎన్నికల కారణంగా గ్రూప్​-2 పరీక్ష వాయిదా పడడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన యువతి.. హాస్టల్​లోని తన రూంలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఘటనాస్థలానికి చిక్కడపల్లి పోలీసులు చేరుకున్నారు. అక్కడ నుంచి మృతదేహాన్ని తరలించే క్రమంలో భారీ ఎత్తున విద్యార్థులు అక్కడకు చేరుకున్నారు.

Lovers Suicide: ఒకే ఊరు.. వేర్వేరు లవ్​స్టోరీలు.. ఒకే రోజు.. ఇద్దరు ఆత్మహత్య

TSPSC Group 2 Exam Postponed : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. వీరికి రాజకీయ పార్టీల తోడుకావడంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ప్రవల్లిక మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు యత్నించగా.. విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వినకపోవడంతో లాఠీఛార్జి చేసి తరిమి కొట్టారు. పోలీసులపై కూడా కొంత మంది వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి నుంచి యువతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి భారీ బందోబస్తు నడుమ తరలించి.. పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ప్రవల్లిక ఉరేసుకున్న గదిని పోలీసులు పరిశీలించగా.. వారికి సూసైడ్​ నోట్​ కనిపించింది. ఆమె స్వస్థలం వరంగల్​ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజీపల్లి గ్రామంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. వెంటనే గాంధీ ఆస్పత్రి నుంచి భారీ భద్రత మధ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

క్షమించండి అమ్మా : "నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని.. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా.. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా.. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు.. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా.. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేపోతున్నా అమ్మా.. ప్రణీ అమ్మానాన్న జాగ్రత్త! అంటూ ప్రవల్లిక రాసిన సూసైడ్​ నోట్​ వాట్సాప్​ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది.

పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న యువతి ఆత్మహత్య.. విద్యార్థుల ఆందోళనతో అర్థరాత్రి ఉద్రిక్తత

Student Suicide in Kulsumpura : ఇంటర్​ విద్యార్థిని సూసైడ్​.. క్షుద్రపూజలే కారణమంటూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.