సంక్షేమ పథకాలపై విపక్షాలు విమర్శలు మానుకోవాలని, ప్రజాక్షేత్రంలో బలం పెంచుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కర్ణాటక తరహా ప్రయోగాలు ఇక్కడ చెల్లవని, కుట్రలు కుతంత్రాలకు ఇకనైనా భాజాపా నేతలు స్వస్థి పలకాలని హితవు పలికారు. కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకోకుండా....అంకితభావంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత కేసీఆర్‌దని కొనియాడారు. ఏ ఎన్నికలొచ్చినా గెలుపు తెరాసదేనని ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : తెరాసకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు