వరంగల్ అర్బన్ జిల్లాలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి జన్మదినం సందర్భంగా హన్మకొండలో కరోనా వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కుమ్మరి కులస్థులకు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ నిత్యావసరాలను అందజేశారు.
మంత్రి కేటీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా సోకకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు