వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)లో తొలిసారిగా నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాలు సందడిగా జరిగాయి. గురువారం రాత్రి నిర్వహించిన ఈ ఉత్సవానికి మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బంజారా యువతులు తమ కోరికలు నెరవేర్చాలని ప్రకృతిని ఆరాధిస్తూ తొమ్మిది రోజుల పాటు భక్తితో ఈ పండుగను జరుపుకుంటారని... ఎంపీ కవిత అన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ ఉత్సవాలు ప్రతీక అని... ప్రకృతితో మానవ సంబంధాలను ఈ పండుగ తెలియజేస్తుందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు విద్యార్థులతో నృత్యాలు చేశారు.
ఇవీ చూడండి.. మంచి మనసున్న మలయాళ మెగాస్టార్