వేసవి వినోదానికి, శరీర సౌష్టవం కోసం చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకే బాట పట్టారు. చల్లని ఈత కొలను ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నారు. అందరూ కలిసి ఈత కొడుతూ సేదతీరుతున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈత కొలనులు ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలు ఈత కొడుతూ వేసవి తాపాన్ని ఆస్వాదిస్తున్నారు. చిన్నారులకు ఈత నేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. భానుడి భగభగలు తట్టుకునేందుకు ఆరోగ్యానికి ఈత చాలా ఉపయోగపడుతుందని నిపుణుల సూచిస్తున్నారు.
ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకునేందుకు.. ఈత చాలా ఉపయోగమని అధికారులు సూచిస్తున్నారు. సెలవులు కావడం వల్ల నగర వాసులు అధిక సంఖ్యలో ఈత కొలనుకు వస్తున్నారన్నారు.
ఇవీ చూడండి: వరంగల్లో ఘనంగా వివేక్ ఉత్సవ్ 2019 వేడుకలు