ETV Bharat / state

'సునీల్‌ మృతికి రాష్ట ప్రభుత్వమే కారణం' - వరంగల్‌ అర్బన్‌ జిల్లా తాజా వార్తలు

కేయూ విద్యార్థి సునీల్‌ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని... వరంగల్‌ అర్బన్‌ జిల్లా విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఆయన ఆత్మహత్యకు నిరసనగా... హన్మకొండలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఇంటిని ముట్టడించారు.

Student union leaders Obsession the home of Minister Errabelli, Student union leaders protest the death of KU student Sunil
కేయూ విద్యార్థి సునీల్‌ మృతికి నిరసనగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఇంటి ముట్టడి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో విద్యార్థి సంఘాల ఆందోళన
author img

By

Published : Apr 2, 2021, 4:16 PM IST

కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్ది బోడ సునీల్ ఆత్మహత్యను నిరసిస్తూ... వరంగల్ అర్బన్ జిల్లాలో విద్యార్ది సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. సునీల్ మృతికి ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ... హన్మకొండలోని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిని ముట్టడించారు.

మృతుని కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని... దాంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

ఇదీ చదవండి: సునీల్‌ నాయక్‌ ఆత్మహత్య రాష్ట్ర ప్రభుత్వ హత్యే: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.