వరంగల్ అర్బన్ జల్లా హన్మకొండ న్యూ రాయపురంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధి గుండా వెళ్తున్న ఇద్దరు చిన్నారులపై రెండు కుక్కలు ఏకకాలంలో దాడి చేశాయి. ఈ దాడిలో ఒక చిన్నారికి గాయాలు కాగా మరొకరు త్రుటిలో తప్పించుకున్నారు. గాయపడిన చిన్నారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన కాలనీలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. తరచుగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మహానగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధికుక్కల బెడద నుంచి తమను రక్షించాలని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: శుభవార్త: ఒక్కో రైతుకు నేరుగా రూ.1.60 లక్షలు!