వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ ఆక్సిజన్ పార్కులో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని కూడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డితో కలిసి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రారంభించారు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు... దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, రైతు బంధు వంటి పథకాల ద్వారా వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఊరూరా మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు.
హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అర్బన్ జిల్లాలో 53.70 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, కార్పోరేటర్ జోరిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.