ETV Bharat / state

వైద్యుల స్ఫూర్తిని దెబ్బతీయొద్దు: ఈటల - మంత్రి ఈటల రాజేందర్​ తాజా వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రులను తక్కువజేసేలా వ్యవహరించొద్దని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి.... సరిపడా పడకలు, ఆక్సిజన్‌ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

warangal mgm hospital
minister eetala
author img

By

Published : Apr 19, 2021, 5:53 PM IST

కొందరు కావాలనే ప్రభుత్వాసుపత్రులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని... వాటిని ఎవరూ నమ్మొద్దని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. నిరంతరం శ్రమిస్తున్న వైద్యుల స్ఫూర్తిని దెబ్బతీయవద్దని మంత్రి ఈటల రాజేందర్​ కోరారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని పరిశీలించిన ఆయన....సరిపడా పడకలు, ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని తెలిపారు.

ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని పరిస్థితి తీవ్రంగా లేదని ఈటల పేర్కొన్నారు. అందరికీ ఆర్టీపీసీఆర్​ టెస్టులు చేయడం కుదరదని... ర్యాపిడ్​ టెస్ట్​లో నెగిటివ్​ వచ్చి.. అప్పటికీ అనుమాన లక్షణాలు ఉంటేనే ఆర్టీపీసీఆర్​ టెస్ట్​ చేయించుకోవడం మంచిదని మంత్రి సూచించారు.

వైద్యుల స్ఫూర్తిని దెబ్బతీయొద్దు: ఈటల

ఇదీ చూడండి: కొందరి నిర్లక్ష్యం.. మరికొందరికి ప్రాణసంకటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.