ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి కేసీఆరే బాధ్యత వహించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదుగురు కార్మికులు గుండెపోటుతో మరణించారన్నారు. పండగ పూట 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు పస్తులుంటే... కేసీఆర్ వాహనాలకు పూజలు చేస్తూ కుటుంబంతో సంతోషంగా గడిపారని విమర్శించారు. సంస్థ నష్టాల్లో ఉన్నంత మాత్రాన ప్రైవేట్ పరం చేస్తామనడం దారుణమని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేసీఆర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:ఆర్టికల్ 370పై విపక్షాలకు మోదీ సవాల్