వరంగల్ అర్బన్ జిల్లా ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీభద్రకాళీ అమ్మవారి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. లాక్డౌన్ కారణంగా ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం అమ్మవారికి అర్చకులు గంధోత్సవం నిర్వహించారు. త్వరలో కరోనా మహమ్మారి అంతం కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు ప్రధానార్చకులు ఆగమశాస్త్ర సామ్రాట్ శేషు తెలిపారు.
- ఇదీ చదవండి : తుంపర్ల ద్వారానే వైరస్ వ్యాప్తి అధికం!