వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన అక్షర టౌన్షిప్ నిర్వహణలో కొనసాగుతున్న కాకతీయ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డ్ వచ్చిందని ఆ సంస్థ ఛైర్మన్ పేరాలా శ్రీనివాస్ తెలిపారు. నిర్మాణరంగంలో గుర్తింపు పొందిన క్రెడయి రిచర్చ్ సంస్థ క్రిసిల్ సంయుక్త నిర్వహణలో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన పోటీలలో 104 నామినేషన్లు రాగా... అందులో 33 రియల్ ఎస్టేట్ సంస్థలకు 3 విభాగాలలో జ్యూరీ పురస్కారాలు అందాయని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం ఓరుగల్లు కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారులకు సమన్వయం, సత్స్సంబంధాల విషయంలో తమ సంస్థ అందిస్తున్న అత్యుత్తమ సేవలను గుర్తించి జ్యూరీ అవార్డుకు ఎంపిక చేశారని సంతోష వ్యక్తం చేశారు. ఈ నెల 28న హైదరాబాద్‌లో మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా జ్యూరీ అవార్డ్ అందుకున్నామని పేరాల శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: వనపర్తి సరళాసాగర్ జలాశయానికి గండి