వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండలోని శ్రీ మెట్టురామలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. దేవస్థానానికి ఉదయం నుండే భక్తుల తాకిడి పెరిగింది. స్వామి వారికి ఉదయం 3 గంటలకే మేలుకొలుపు, సుప్రభాత సేవ, రుద్రాభిషేకాలు నిర్వహించారు. శివయ్యకు ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించి దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు.
శంఖు, డమరుక నాదాలు, ఓం నమ: శివాయ నామస్మరణలతో దేవాలయ ప్రాంగణంలో భక్తి భావం విరాజిల్లుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: మహబూబాబాద్‌లో 12 జ్యోతిర్లింగాలు ఏర్పాటు