వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం అమ్మవారికి దీప్తాక్రమం పూజలు జరిపారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక అలంకరణలు చేయడం పూర్తిగా నిలిపి వేశామని... సాధారణ అలంకరణలో మాత్రమే పూజలు నిర్వహిస్తున్నామని అర్చకులు వివరించారు. కరోనా దృష్ట్యా కొద్దిమందిని మాత్రమే సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: భూ ఆక్రమణలకు చైనా క్యాబేజీ వ్యూహం..!