వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పింగిలి జూనియర్ కళాశాల విద్యార్థినులను ఎన్ఎస్ఎస్ క్యాంపు నిమిత్తం కాజీపేట మండలం మడికొండ ప్రభుత్వ పాఠశాలకు తీసుకునివెళ్ళారు. విద్యార్థినుల భద్రతపై మాత్రం ఎన్ఎస్ఎస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు.
రెండు మినీ గూడ్స్ వాహనాల్లో 70 మంది విద్యార్థినులను గాలి కూడా చొరబడనంత ఇరుకుగా నిలబెట్టి తరలించారు. క్యాంపులో వారికి అవసరమైన వస్తువులను కూడా అదే వాహనంలో తీసుకువెళ్లారు.
అంత చిన్న వాహనాల్లో 70 మందిని తరలించండంపై ఎన్ఎస్ఎస్ ప్రతినిధిని ఈటీవీ భారత్ ప్రశ్నించింది. క్యాంపు నిమిత్తం తమకు వచ్చే నిధులు సరిపోనందున ఇలా తీసుకువచ్చామని తెలిపారు.