వరంగల్ నగరంలో వర్షాలు జోరుగా కురుస్తున్నందున నగరం తడిసి ముద్దైంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో వర్షం హోరెత్తించింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి చేరిన మురుగు నీరు వాహన చోదకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. వర్షం భారీగా కురవడం వల్ల ఇబ్బందులెదుర్కొన్న నగర ప్రజలు బయటకు రాకుండా ఉన్నారు.
ఇవీ చూడండి : మున్సిపల్ చట్టంలో లోపాలున్నాయి: జీవన్ రెడ్డి