ETV Bharat / state

దేశాన్ని విభజించి పాలించడమే బీజేపీ విధానం: రేవంత్‌రెడ్డి - వరంగల్​లో రేవంత్​రెడ్డి యాత్ర

Hath Se Hath Jodo Yatra in Warangal: జనగామ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవాళ రేవంత్​ యాత్ర కొనసాగింది. గ్రామాల్లో పాదయాత్ర చేసి, పాలకుర్తిలో జరిగే సభలో రేవంత్ పాల్గొన్నారు. దేశాన్ని విభజించి, పాలించడమే బీజేపీ విధానమని రేవంత్​రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భద్రాచలం గుర్తింపు కోల్పోయిందని ఆరోపించారు.

Hath Se Hath Jodo Yatra in Warangal
Hath Se Hath Jodo Yatra in Warangal
author img

By

Published : Feb 14, 2023, 10:40 PM IST

Updated : Feb 14, 2023, 10:47 PM IST

Hath Se Hath Jodo Yatra in Warangal: దేశాన్ని విభజించి, పాలించడమే బీజేపీ విధానమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భద్రాచలం గుర్తింపు కోల్పోయిందని రేవంత్ విమర్శించారు. రూ.100కోట్లతో రామాలయం అభివృద్ధి చేస్తానని విస్మరించారన్నారు. వరద బాధితులకు ఇస్తామన్న రూ.10 వేలు కూడా ఇవ్వలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితులకు పరిహారం అందలేదని తెలిపారు.

తెలంగాణలో బీజేపీ లేదు... గెలిచేది లేదని ఎద్దేవా చేశారు. పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థికసాయం చేస్తామని పేర్కొన్నారు. కౌలు రైతులకు రూ.15 వేలు ఆర్థికసాయం అందిస్తామన్నారు. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ చెప్పారు. రేవంత్​రెడ్డి వరంగల్ పార్లమెంట్ పరిధిలో రేపటి నుంచి చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Revanth Reddy Padayatra in Warangal: జనగామ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవాళ రేవంత్​ యాత్రను చేపట్టారు. దేవరుప్పుల, కొత్త కాలనీ, దేవరుప్పుల తండా, ధర్మాపురం, మైలారం, విస్నూరు, కాపులగడ్డ తండా తదితర గ్రామాల్లో పాదయాత్ర చేసి, పాలకుర్తిలో జరిగే సభలో ఆయన పాల్గొన్నారు. 16న వర్ధన్నపేట 17న స్టేషన్ ఘన్​పూర్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహిస్తారు.

Revanth Reddy Padayatra: శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల 18, 19 తేదీల్లో యాత్రకు విరామం ఉంటుంది. ఈ నెల 20న వరంగల్ తూర్పు, పశ్చిమ.. 21, 22 తేదీల్లో భూపాలపల్లి నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతుంది. ఛత్తీస్​గఢ్​లో జరిగే ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల అనంతరం.. ఈ నెల 27న పరకాల నియోజకవర్గలో రేవంత్ పాదయాత్ర చేస్తారు.

సోమవారం హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పర్యటించారు. పాదయాత్రలో ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రాత్రి మణుగూరు అంబేడ్కర్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. దళితున్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్​ పార్టీ అధ్యక్ష్య పదవినైనా దళితుడికి కట్టబెట్టగలరా? అని రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.

ప్రజాపోరాటాలు, యువకుల త్యాగాలను చూసి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే... కేసీఆర్ జనం ఆకాంక్షాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పోడు భూములపై తొమ్మిదేళ్లుగా ఏం చేయని కేసీఆర్.. 9 నెలల్లో ఏదో చేస్తామని హామీ ఇస్తున్నారని విమర్శించారు. మోదీ పాలన కంటే మన్మోహన్‌ నయమని చెబుతున్నసీఎం... నోట్ల రద్దు, జీఎస్​టీ సహా అనేక అంశాల్లో ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 14, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.