వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుపై ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హన్మకొండలోని విద్యుత్ భవన్ నుంచి ఏకశిలా పార్కు వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రభాకర్ రావుపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రేవంత్రెడ్డి ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: అసోం ఎన్ఆర్సీ విడుదలకు సర్వ సన్నద్ధమైన సర్కారు