ETV Bharat / state

అన్నదాతకు అందని పెట్టుబడి సాయం - వరంగల్ అర్బన్​ జిల్లా

రైతుల కష్టాలను దూరం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. పథకాలతో అండగా నిలుస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సీజన్‌ మొదలైనా రైతు బంధు డబ్బులు అందక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

అందని పెట్టుబడి సాయం
author img

By

Published : Jul 29, 2019, 5:04 PM IST

రైతు బంధు పథకం ద్వారా ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తోంది. ఎన్నికల కోడ్‌ ముగిసిన కొద్ది రోజులకు కొంత మంది ఖాతాల్లో సాయాన్ని జమచేయడంతో అన్నదాతలు ఆనందపడ్డారు. ఆ సంతోషం కొందరికే పరిమితమైంది. వరంగల్ అర్బన్​ జిల్లాలో చాలా మందికి అందలేదు. ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌ ఆరంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా నేటికీ బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. దీంతో రైతన్నలు తరచూ బ్యాంకులకు వెళ్లి ఖాతాలు తనిఖీ చేసుకుంటున్నారు.

రైతులకు ఇదో సమస్య

సకాలంలో వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇదో సమస్యగా మారింది. వ్యవసాయశాఖ అధికారులు రైతుబంధు పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతుల వివరాలు, ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జూన్‌ నుంచే నగదు జమ చేస్తూ వచ్చారు. అయితే సాంకేతిక కారణాల వల్ల జమ కావడం నిలిచిపోయింది.

రుణాలు అందే అవకాశం కూడా కనిపించడం లేదు

దీంతో రైతులు పంట పెట్టుబడికి ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరో వైపు బ్యాంకుల నుంచి పంట రుణాలు అందే అవకాశం కూడా కనిపించడం లేదు. వర్షాలు సమృద్ధిగా కురవడం ప్రారంభమైతే అప్పటికప్పుడు పెట్టుబడి సాయం ఏట్లా అనే దిగులతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

ఇదీ చూడండి : పరవళ్లు తొక్కుతున్న తాలిపేరు జలాశయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.