ప్రకృతి సిద్ధమైన నీటి వనరుల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే 21 వ శతాబ్దంలో నీటి సంక్షోభం సంభవిస్తుందని జలసంరక్షకుడు, రామన్ మెగాసెస్ పురస్కార గ్రహిత రాజేంద్ర సింగ్ తెలిపారు. గోదావరి జలసంరక్షణ యాత్ర అనే అంశంపై వరంగల్లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్లో ఆయన ప్రసంగించారు.
నీటి వనరుల సంరక్షణ ప్రపంచ వ్యాప్త సమస్యగా గుర్తించారని... కానీ దానికి పరిష్కారం మాత్రం స్థానికంగానే ఉందన్నారు. వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేసి భూగర్భజలాలను పెంచుకోవడం ద్వారానే నీటి సమస్యలను అదిగమించవచ్చని ఆయన తెలిపారు. నీటి సంరక్షణపై ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని... లేకుంటే భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.
ఇదీ చూడండి : జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!