ETV Bharat / state

కోర్టులో స్పృహతప్పి పడిపోయిన ప్రొఫెసర్​ కాసిం - osmania university associate professor Kaseem news

ప్రొఫెసర్​ కాసింను వరంగల్​ అర్బన్​ జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ ఆయన స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే పోలీసులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Prof. Khaseem unconscious in warangal urban court
కోర్టులో సృహతప్పి పడిపోయిన ప్రొఫెసర్​ కాసిం
author img

By

Published : Feb 11, 2020, 8:15 PM IST

వరంగల్​ రూరల్​ జిల్లా ఖానాపురం పోలీస్​స్టేషన్​లో ప్రొఫెసర్​​ కాసింపై కేసు నమోదైంది. అయితే ఆ కేసు విషయంలో పీటీ వారెంట్​పై చర్లపల్లి జైలు నుంచి వరంగల్​ అర్బన్​ జిల్లా కోర్టుకు తీసుకురాగా... కోర్టులో అస్వస్థతకు గురై సృహతప్పి పడిపోయాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ప్రొఫెసర్​ కాసింను చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సుమారు 3 గంటలపాటు బందోబస్తు మధ్య చికిత్స అందించారు.

కొంత కుదుటపడ్డాక ఆయనను వరంగల్​ సెంట్రల్​ జైలుకు తరలించారు. కేసు ఈనెల 25కు వాయిదా పడింది. ప్రొఫెసర్​ కాసింకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో పోలీసులు అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.