కరోనా తగ్గుముఖం పట్టడంతో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు తరగతుల నిర్వహించేందుకు.. విద్యాసంస్ధలు సన్నద్ధమౌతున్నాయి. వరంగల్‌లో పలు విద్యాసంస్థలు తరగతి గదుల్లో బయో స్టెరిలైజ్ యంత్రాలను అమరుస్తున్నాయి. విద్యార్ధుల ఆరోగ్యం, తల్లిదండ్రుల భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని.. తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. బయో స్టెరిలైజర్లతో ఏ క్రిములూ విద్యార్థుల దరిచేరకుండా కాపాడవచ్చని చెబుతున్నారు.
వరంగల్లోని పలు ప్రైవేటు విద్యాసంస్ధల యజమానులు కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ.. వచ్చే వారం నుంచి విద్యాసంస్ధలు తెరిచేందుకు.. అన్ని విధాలా సన్నద్ధమవుతున్నారు. చాలామంది తరగతి గదులను సానిటైజ్ చేసే పనిలో ఉండగా.. భీమారంలోని ఓ ప్రైవేటు స్కూల్ మరో అడుగు ముందుకేసి సూక్ష్మ క్రిములను హతమార్చేందుకు ఉపయోగించే బయో స్టెరిలైజ్ యంత్రాలను తరగతి గదుల్లో అమరుస్తున్నట్లు వెల్లడించింది. కేవలం తరగతి గదుల్లోనే కాకుండా విద్యార్ధులు వచ్చే బస్సుల్లోనూ వీటని ఏర్పాటు చేయనున్నట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: HIGH COURT: పెద్దలే కరోనా నిబంధనలు పాటించట్లే... పిల్లలు పాటిస్తారా?