వరంగల్‌లో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన రంగోలి పోటీల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందమైన రంగవళ్లులు తీర్చిదిద్దారు.
స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం స్లో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ గుండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్ హాజరయ్యారు.
కనువిందుగా సాగిన కైట్ ఫెస్టివల్లో చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ... ఉత్సాహంగా గడిపారు. ముగ్గుల పోటీలను.... మున్సిపల్ అధికారులు పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: భారతదేశానికి అక్షయ పాత్రగా తెలంగాణ.. ధాన్యం ఉత్పత్తిలో టాప్!