వరంగల్ నగరంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఏసీపీ నరసయ్య ఆధ్వర్యంలో ఎంజీఎం చౌరస్తా వద్ద కేంద్ర బలగాలతో వాహన తనిఖీలు నిర్వహించారు. అంతకుముందుగా వరంగల్ చౌరస్తా రుద్రమా కూడలి, చంద్రకాంత్ అయ్యా కూడలి వద్ద పోలీసులు సోదాలు జరిపారు. నేర ప్రవృత్తి కలిగిన వారిని బ్యాండ్ ఓవర్ చేసినట్లు ఏసీపీ నర్సయ్య తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక పౌరుడు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించాలని సూచించారు.
ఇవీ చదవండి: మలక్‌పేటలో రూ.34 లక్షలు పట్టివేత