పోలీసు అమరవీరుల వారోత్సవాలను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ వీ.రవీందర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌజ్‌ను సీపీ ప్రారంభించారు. బాంబ్ డిస్పోజల్, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్, కమ్యూనికేషన్ విభాగాలకు సంబంధించి స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆయుధాల పనితీరును విద్యార్ధులకు సీపీ తెలియజేశారు. ప్రజల భద్రత, పోలీసు బందోబస్తు, సాంకేతికత వినియోగం మొదలైన వాటిపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ ఓపెన్ హౌజ్‌ను సందర్శించవచ్చని తెలిపారు.
ఇదీ చూడండి : బయోకెమి"కిల్స్"... పుట్టగొడుగుల్లా పురుగుమందుల ఉత్పత్తులు!